సైనికుల ఆత్మ స్థైర్యం దెబ్బతీసేలా మాట్లాడొద్దు: కిషన్ రెడ్డి

సైనికుల ఆత్మ స్థైర్యం దెబ్బతీసేలా మాట్లాడొద్దు: కిషన్ రెడ్డి
  • కాంగ్రెస్​ నేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

ముషీరాబాద్/బషీర్​బాగ్ వెలుగు: సీఎం రేవంత్ రెడ్డికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ హైదరాబాద్​నగర అభివృద్ధిపై లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కోట్లు ఖర్చుచేసి పోటీలు నిర్వహిస్తున్న ప్రభుత్వం.. బస్తీల్లో పేరుకుపోయిన సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు. శుక్రవారం ఆయన గాంధీనగర్, కవాడిగూడ, హిమాయత్ నగర్ లో రూ.కోటి50లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్​తో కలిసి ప్రారంభించారు. 

దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగాపెట్టి విధులు సైనికులపై పాక్ మాట్లాడిన మాటలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రిపీట్ చేస్తూ దేశ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దేశ సైనికులను రాజకీయాల్లోకి లాగొద్దని, వారి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తినేలా మాట్లాడడం మానుకోవాలని సూచించారు. 

తెలంగాణకు 70 శాతం రెవెన్యూ తీసుకొస్తున్న సిటీలోని పలు కాలనీలు, బస్తీలు, వాడల్లో మౌలిక సదుపాయాల కల్పనకు జీహెచ్ఎంసీ, వాటర్​బోర్డుకు నిధులు కేటాయించకపోవడం శోచనీయమన్నారు. సిటీలో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు లేకపోవడంతోనే నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.