కేసీఆర్‌‌‌‌కు ప్రజలపై నమ్మకం లేదు : కిషన్ రెడ్డి

కేసీఆర్‌‌‌‌కు ప్రజలపై నమ్మకం లేదు :  కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు :  సీఎం కేసీఆర్, ఆయన కుటుంబానికి ప్రజలపై నమ్మకం లేదని, డబ్బుతో రాజకీయం చేసి గెలవాలని చూస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. తడి బట్టతో గొంతు కోసే రకం కేసీఆర్ అని మండిపడ్డారు. గురువారం హైదరాబాద్ సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్‌‌‌‌లో పార్టీ అభ్యర్థులకు బీఫామ్‌‌లు అందజేశారు.

ఈ సందర్భంగా కిషన్‌‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాఫియాగా మారి రాష్ట్ర ప్రజలను వణికిస్తున్నారు. మాఫియాను నమ్ముకోవడం, డబ్బులు పంచడం, అధికార దుర్వినియోగానికి పాల్పడడమే కేసీఆర్ పని. మాటల గారడీ చేసి రాష్ట్ర ప్రజలను బుట్టలో వేసుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు” అని ఆయన మండిపడ్డారు.