నెల రోజుల్లో చర్లపల్లి కొత్త రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వస్తుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. చర్లపల్లి టెర్మినల్ పనులను పరిశీలించిన కిషన్ రెడ్డి.. రూ.430 కోట్లతో అత్యాధునికి సదుపాయాలతో కొత్త టెర్మినల్ నిర్మిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకున్న కొత్త టెర్మినల్ ను త్వరలో ప్రధాని మోదీ ప్రారంభిస్తారని చెప్పారు.
వందేభారత్ లో స్లీపర్ కోచ్ లు
చర్లపల్లి నుంచి నగరంలోకి రోడ్ కనెక్టివిటీ పెంచాల్సి ఉందన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సర్కార్ యుద్ధ ప్రాతిపాదికన రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వందేభారత్ ట్రైన్లలో స్లీపర్ కోచ్ లు ప్రారంభిస్తాం.. హైదరాబాద్ నుంచి నడిచే వందేభారత్ రైళ్లలోనే స్లీపర్ కోచ్ లు ప్రవేశ పెడతామని తెలిపారు. రాష్ట్రానికి మూడు మేజర్ టెర్మినల్స్ ఉన్నాయన్నారు. హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ ను పొడిగించాలన్నారు కిషన్ రెడ్డి.