
హైదరాబాద్: దేశ అంతర్గత భద్రత కేంద్రం బాధ్యత.. దానిని నెరవేర్చడంలో ప్రధాని మోదీ ఫెయిలయ్యారన్న సీఎం రేవంత్రెడ్డి కామెంట్లకు బీజేపీ స్టేట్చీఫ్, కేంద్ర మంత్రికిషన్రెడ్డి కౌంటర్ఇచ్చారు. మరోసారి కాంగ్రెస్ మన వీర సాయుధ దళాలను, జవాన్లను అవమానించింది. నేషనల్ సెక్యూరిటీపై బుజ్జగింపుల రాజకీయాలు నడపడమే కాంగ్రెస్ విధానం. 26/11 ముంబై దాడుల నుంచి హైదరాబాద్ వరుస పేలుళ్ల వరకు, అలాగే జమ్మూకశ్మీర్‌లో పౌరులు, సైనికులపై దాడులన్నీ యూపీఏ హయాంలోనే జరిగాయి.
దీనికి ఇంటెలిజెన్స్ వైఫల్యాలే అందామా? ఆ ఘటనలకు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను బాధ్యులను చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా? 'జై శ్రీరాం' అనే నినాదాలు చేయడం కాంగ్రెస్‌కు ఇబ్బందిగా ఉండవచ్చు. కానీ 140 కోట్ల మంది భారతీయులకు ఎలాంటి ఇబ్బంది లేదు. రేవంత్ రెడ్డి చీప్పాలిటిక్స్ బంజెయ్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల హామీల అమలుపై ఫోకస్చేయ్’ అని కిషన్రెడ్డి హితవు పలికారు.