నెహ్రూ తర్వాత.. ఆ ఘనత ప్రధాని మోదీదే: కిషన్ రెడ్డి

నెహ్రూ తర్వాత.. ఆ ఘనత ప్రధాని మోదీదే: కిషన్ రెడ్డి
  •     కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి 

ఖైరతాబాద్,వెలుగు: నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి దేశ ప్రధాని అయిన ఘనత మోదీకే దక్కిందని కేంద్రమంత్రి జి.కిషన్​రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో దేశ వ్యతిరేక శక్తులు బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచార కుట్రలు చేశాయని ఆరోపించారు.  హైదరాబాద్​సెంట్రల్​జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశం ఆదివారం సోమాజిగూడలోని జయ గార్డెన్ లో జరిగింది.

 ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని,  కాంగ్రెస్​తప్పుడు ప్రచారం చేసిందన్నారు. వచ్చే జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో అన్ని వార్డులను చేజిక్కించుకుని బీజేపీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ హైదరాబాద్​సెంట్రల్​జిల్లా అధ్యక్షుడు డాక్టర్​ ఎన్​.గౌథమ్​ రావ్​ అధ్యక్షతన జరిగిన సమావేశంలో  మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి,మహంకాళీ జిల్లా పార్టీ అధ్యక్షుడు బూర్గుల శ్యాంసుందర్​గౌడ్​, అట్లూరి రామకృష్ణ,ఎల్​.దీపక్​రెడ్డి పాల్గొన్నారు.