IND vs WI: వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్.. రాహుల్‌కు కెప్టెన్సీ.. గిల్, పంత్ సంగతేంటి..?

IND vs WI: వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్.. రాహుల్‌కు కెప్టెన్సీ.. గిల్, పంత్ సంగతేంటి..?

వెస్టిండీస్ తో స్వదేశంలో జరగబోయే రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు టీమిండియా కెప్టెన్ గా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేంటి టీమిండియా కొత్త టెస్ట్ కెప్టెన్ గిల్ కదా.. ఒకవేళ గిల్ లేకపోతే పంత్ సారధ్య బాధ్యతలు తీసుకోవాలి కదా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే వీరిద్దరూ వెస్టిండీస్ సిరీస్ కు అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం పంత్ గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్ లో గాయపడిన పంత్ కు ఆరు నుంచి 8 వారాల రెస్ట్ కావాలని డాక్టర్స్ సూచించారు. దీంతో వైస్ కెప్టెన్ పంత్ విండీస్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు దాదాపు దూరం కానున్నట్టు సమాచారం.   

మరోవైపు గిల్ కు వెస్టిండీస్ తో జరగబోయే రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు రెస్ట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. గిల్ బిజీ షెడ్యూల్ ను దృష్టిలో పెట్టుకొని ఈ యువ సారథిపై బీసీసీఐ పని భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఆసియా కప్ తర్వాత వెస్టిండీస్ తో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు రెస్ట్ ఇవ్వనున్నారు. ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరుగుతుంది. సెప్టెంబర్ 28 న ఫైనల్ మ్యాచ్ ఆడితే 29న దుబాయి నుంచి భారత జట్టు ఇండియాకు వస్తుంది. 30న అహ్మదాబాద్ చేరుకోవాల్సి ఉంది. అక్టోబర్ 1న టెస్ట్ సిరీస్ కు సిద్ధమవ్వాలి. దీంతో గిల్ కు కనీసం ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకునే అవకాశం లేకుండా పోతుంది. 

వస్తున్న సమాచార ప్రకారం గిల్ కు ఆస్ట్రేలియా సిరీస్ నుంచి రెస్ట్ ఇవ్వాలని భావిస్తోందట. అక్టోబర్ 19న పెర్త్ లో తొలి వన్డేతో ఆస్ట్రేలియా టూర్ మొదలవుతుంది. ఈ సిరీస్ కు గిల్ మళ్ళీ భారత జట్టులో కలిసే అవకాశం ఉంది. కెప్టెన్ గిల్ తో పాటు వైస్ కెప్టెన్ పంత్ అందుబాటులో లేకపోతే సీనియర్ ప్లేయర్ రాహుల్ భారత జట్టు పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉంది. ఇంగ్లాండ్ తో సిరీస్ తర్వాత రాహుల్ ఎలాంటి క్రికెట్ ఆడలేదు. ప్రస్తుతం భారత టీ20 జట్టులో స్థానం దక్కించుకోలేకపోతున్న రాహుల్.. వన్డే, టెస్టుల్లో రెగ్యులర్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు.