ఇంపాక్ట్ ప్లేయర్ పద్ధతి ఉంటే కుల్దీప్తో బౌలింగ్ వేయించేవాడిని : కేఎల్ రాహుల్

ఇంపాక్ట్ ప్లేయర్ పద్ధతి ఉంటే కుల్దీప్తో బౌలింగ్ వేయించేవాడిని : కేఎల్ రాహుల్

రెండో టెస్టులో టార్గెట్ ఛేజింగ్లో వికెట్లు కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు.  బంగ్లా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని...కొత్త బంతిని ఎదుర్కోవడం కొద్దిగా ఇబ్బంది అయిందన్నాడు. అయితే బాల్ పాతబడ్డాక.. పరుగులు రాబట్టం ఈజీ అయిందన్నాడు. ఏదేమైనా చివరకు మ్యాచ్ గెలవడం ఆనందంగా ఉందని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. 

వారి వల్లే గెలిచాం..

రెండో ఇన్నింగ్స్లో మిడిలార్డర్ అద్భుతంగా ఆడిందని కేఎల్ రాహుల్ కొనియాడాడు. అయితే వరుసగా వికెట్లు కోల్పోవడంతో డ్రెస్సింగ్ రూంలో టెన్షన్ వాతావరణం నెలకొందన్నాడు. కానీ అశ్విన్ , శ్రేయస్ అయ్యర్ ఇద్దరు బంగ్లా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్నాడు. వారి వల్లే ఈ మ్యాచ్ గెలిచామని చెప్పాడు. 

కుల్దీప్ను అందుకే తీసుకోలేదు..

రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో కుల్దీప్ లేని లోటు కనిపించిందని కేఎల్ రాహుల్ అన్నాడు. అయితే మొదటి రోజు పిచ్ను పరిశీలిస్తే..స్పిన్నర్లతో పాటు..ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని అనిపించిందని..అందుకే  ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను తీసుకోవాల్సి వచ్చిందన్నాడు. దీని కారణంగానే కుల్దీప్ను పక్కనపెట్టామన్నాడు. అందుకు బాధపడటం లేదని..ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫాస్ట్ బౌలర్లే ఎక్కువ వికెట్లు తీసినట్లు గుర్తు చేశాడు. అయితే ఈ సిరీస్లో ఇంపాక్ట్ ప్లేయర్ పద్దతి ఉంటే మాత్రం..కుల్దీప్తో బౌలింగ్ వేయించేవాడినని రాహుల్ చెప్పాడు. ఐపీఎల్లో ప్రవేశపెట్టబోయే ఇంపాక్ట్ ప్లేయర్ విధానం..టెస్టుల్లోనూ ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.