వరలక్ష్మి పూజలో క్లీంకార.. ఫోటో షేర్ చేసిన ఉపాసన

వరలక్ష్మి పూజలో క్లీంకార.. ఫోటో షేర్ చేసిన ఉపాసన

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) ఉపాసన(Upasana) లకు జూన్ 20న పాప పుట్టిన విషయం తెలిసిందే. ఈ జంటకు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత ఆడబిడ్డ జన్మించడంతో మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. రామ్ చరణ్- ఉపాసన కూతురికి క్లీంకార(Klin kaara) గా నామకరణం కూడా చేశారు.

Also Read : సెప్టెంబర్ 8న నవ్వించే తురుమ్‌‌‌‌ ఖాన్‌‌‌‌లు

అయితే పాప పుట్టి రెండు నెలలు గడుస్తున్నా మీడియా కు మాత్రం ఆమె మొహాన్ని చూపించలేదు. పాప ఎలా ఉందొ చూడటానికి మెగా ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ మధ్య ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు క్లీంకారతో జెండా ఎగరవేయించారు. కానీ అప్పుడు కూడా పాప మొహం కనపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక తాజాగా మరోసారి కూడా అలానే పాప మొహం కనపడకుండా ఫోటో షేర్ చేశారు ఉపాసన.  

తాజాగా ఉపాసన తన ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి తొలిసారిగా వరలక్ష్మీ పూజలో పాల్గొంది. ఈ విషయాన్ని అభిమానులంతో పంచుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటోను కూడా షేర్ చేశారు. కానీ అందులో కూడా క్లీంకార ముఖం కనబడకుండా కవర్ చేశారు. ఇక ఈ ఫొటోకు.. క్లీంకారతో మొదటి వరలక్ష్మీ పూజ. ఇంతకు మించి ఇంకేమి అడగలేను అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అది చూసిన మెగా ఫ్యాన్స్.. మా మెగా చిట్టి తల్లి అంటూ కామెంట్స్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం క్లీంకారకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.