
శ్రీరామ్ నిమ్మల హీరోగా శివకళ్యాణ్ దర్శకత్వంలో ఎండీ. ఆసిఫ్ జానీ నిర్మించిన చిత్రం ‘తురుమ్ ఖాన్‌లు’. సెప్టెంబర్ 8న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన సోనూ సూద్ మాట్లాడుతూ ‘ఇది చాలా మంచి సబ్జెక్ట్. వచ్చే ఏడాదికి పార్ట్2, పార్ట్3 కూడా తీసేంత కథ ఇది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పాడు.
ALSO READ :పురాతన కట్టడాలను బాగు చేస్తం
నిర్మాత బెక్కం వేణుగోపాల్, అంబర్ పేట్ శంకర్, చీకోటి ప్రవీణ్, చిన్న శ్రీశైలం యాదవ్ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. శ్రీరామ్ మాట్లాడుతూ ‘రియల్ లైఫ్‌లో తురుమ్ ఖాన్ సోనూ సూద్ గారే. ఈ చిత్రంలో ప్రతి క్యారెక్టర్‌కు ప్రాముఖ్యత ఉంటుంది. రెండున్నర గంటలసేపు ఆడియెన్స్‌ను నవ్విస్తుంది’ అని అన్నాడు.
తుపాకులగూడెం అనే ఒక విలేజ్‌లో విష్ణు, ఈశ్వర, బ్రహ్మ అనే ముగ్గురు క్యారెక్టర్ల చుట్టూ ఈ కథ నడుస్తుందని డైరెక్టర్ శివ కళ్యాణ్ చెప్పాడు. మంచి కంటెంట్ ఉన్న చిత్రమిది. ప్రతి ఒక్కరికీ నచ్చుతుందన్నారు నిర్మాత అసిఫ్ జానీ. మూవీ టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.