ఇది ముగింపు కాదు.. ఆరంభం మాత్రమే..ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా యువత విజయం: కోదండరాం

ఇది ముగింపు కాదు.. ఆరంభం మాత్రమే..ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా  యువత విజయం: కోదండరాం

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత విజయమని ఎమ్మెల్సీ ప్రొఫేసర్ కోదండరాం అన్నారు. గడిచిన 12 ఏండ్లలో కేంద్రంలోని మోదీ సర్కార్ తొలిసారి విద్యార్థులు, యువత ఒత్తిడితో వెనక్కి తగ్గిందన్నారు. మరో మార్గం లేక మంత్రితో రాజీనామా చేయించిందని చెప్పారు. ప్రజల జీవితంతో చెలగాటమాడితే సహించేది లేదని యువత స్పష్టం చేసిందన్నారు. ఇది ఉద్యమానికి ముగింపు కాదని  ఆరంభం మాత్రమేనని కేంద్రాన్ని హెచ్చరించారు. శనివారం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తోన్న విద్యార్థులకు కోదండరాం సంఘీభావం తెలిపారు. 

అనంతరం.. మంత్రి రాజీనామాపై స్పందించారు. విద్యార్థులను కేంద్రం చులకనగా చూసిందని అదే ఒక ఉద్యమ నిర్మాణానికి  దారితీసిందని చెప్పారు. యువత డిమాండ్ల కోసం ఎంతవరకైనా పోరాడుతారనేది మంత్రి రాజీనామా స్పష్టం చేసిందని తెలిపారు. ఇలాంటి ఒత్తిళ్లు కేంద్ర ప్రభుత్వంపై మరిన్ని పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ప్రజలు అధికారం ఇచ్చింది అందర్నీ కాపాడుకోవడానికే గాని, ప్రజల జీవితంతో చెలగాటం ఆడితే సహించేది లేదన్నారు.