ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో మిగతా టెస్టులకు టీమిండియా కెప్టెన్ వీరాట్ కోహ్లీ లేకపోవడం ఆ జట్టుకు నష్టమని ఆసిస్ స్టార్ బ్యాట్స్ మన్ స్మిత్ అన్నాడు. ఎందుకంటే అతను ఆడిన మొదటి టెస్టును చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నాడు. ఆసిస్ బౌలింగ్ ఎంత కష్టంగా ఉన్నా కోహ్లీ నిలకడగా బ్యాటింగ్ చేయడమే ఇందుకు కారణమన్నాడు. కోహ్లీ భార్య అనుష్క శర్మ మొదటి సారి జనవరిలో బిడ్డకు జన్మనివ్వబోతున్న తరుణంలో కోహ్లీ భారత్ కు వెళ్లడాన్ని మెచ్చుకున్నాడు స్మిత్. ఈ విషయంలో కోహ్లీ నిర్ణయాన్ని మెచ్చుకోవాలన్నాడు. ఒక వేళ కోహ్లీ ఆస్ట్రేలియాలో ఉంటే తనపై ఎంతో ఒత్తిడి ఉండేదన్నాడు. కోహ్లీకి తన జీవితంలో ఇదొక కీలక ఘట్టమని.. అనుష్క శర్మ వెంట ఉండటమే మంచిదన్నాడు. మొదటి టెస్టు కాగానే వీరాట్ కోహ్లీ ఇండియాకు పయనమయ్యాడు. అనుష్క శర్మ జనవరిలో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.

