IPL 2023: మన్ దీప్ సింగ్ చెత్త రికార్డు

IPL 2023: మన్ దీప్ సింగ్ చెత్త రికార్డు

ఐపీఎల్ 2023 అభిమానులను క్రికెట్ మజాను అందిస్తోంది. ప్రతీ మ్యాచులో భారీ స్కోర్లు నమోదవుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఏప్రిల్ 6వ తేదీన  గురువారం కోల్ కత్ నైట్ రైడర్స్, -రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ బ్యాట్స్ మన్ దుమ్మురేపారు. 20 ఓవర్లలో 204 పరుగులు చేశారు. కేకేఆర్ ఓపెనర్ గుర్భాజ్, శార్దుల్ ఠాకూర్ లు అర్ధ శతకాలతో చెలరేగి.. జట్టును ఆదుకుంటే..మన్ దీప్ సింగ్ ఓ చెత్త రికార్డును తనపేరిట లిఖించుకున్నాడు. 

వన్ డౌన్ లో వచ్చిన మన్ దీప్ సింగ్..డేవిడ్ విల్లీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో చెత్త రికార్డును నమోదు చేశాడు.  ఈ క్రమంలోనే రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్ ల చెత్త రికార్డును బద్దలు కొట్టాడు. రోహిత్ శర్మ  ఐపీఎల్ చరిత్రలో 223 మ్యాచుల్లో 14 సార్లు డకౌట్ అయ్యాడు. దినేష్ కార్తీక్ 209 మ్యాచుల్లో 14 సార్లు డకౌట్ అయ్యాడు. మన్ దీప్ సింగ్  97 ఇన్నింగ్స్ ల్లో 15 సార్లు డకౌట్ అయ్యి  రోహిత్ శర్మ, దినేష్ కార్తీ్క్ చెత్త రికార్డును బ్రేక్ చేశాడు.