కాంగ్రెస్ సీనియర్లకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సపోర్ట్

కాంగ్రెస్ సీనియర్లకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సపోర్ట్

రేవంత్పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన కాంగ్రెస్ సీనియర్లకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మద్దతు ప్రకటించారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఎంపీ ఆయన తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఫోన్ చేశారు. భట్టి నివాసంలో జరిగిన కాంగ్రెస్ సీనియర్ల సమావేశానికి వెంకట్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సమావేశానికి తనకు కూడా పిలవాల్సి ఉండేనని అన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్టీ సీనియర్ల వెంట ఉంటానని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.  

పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తీరుపై ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్‌ సీనియర్లు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. కమిటీల నియామకంపై  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారంతా రేవంత్ ను బాయ్ కాట్ చేయాలని నిర్ణయించారు. పార్టీని నాశనం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ.. సేవ్‌ కాంగ్రెస్‌ నినాదం ఎత్తుకున్నారు. రేవంత్‌కు వ్యతిరేకంగా భట్టి నివాసంలో సమావేశమైన నేతలు త్వరలోనే మరోసారి భేటీకి సిద్ధమవుతున్నారు