
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ సీనియర్ లీడర్ కొండా సురేఖ భేటీ అయ్యారు. పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేసేందుకు ఉద్దేశించిన లేఖను రేవంత్ కు అందజేశారు. పీసీసీ కమిటీపై అసంతృప్తితోనే రాజీనామా చేస్తున్నట్లు రేవంత్ కు సురేఖ వివరించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తన పేరు లేకపోవడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తన లాంటి సీనియర్ నాయకురాలికి పార్టీలో తగిన ప్రాధాన్యత లేదని తెలిపారు. వరంగల్ జిల్లా నుంచి ఒక్క లీడర్ పేరు కూడా కమిటీలో లేదన్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ చీఫ్ ఖర్గే దృష్టికి తీసుకెళ్లి పార్టీలో మంచి గుర్తింపు వచ్చేలా చేస్తానని..తొందరపడొద్దు అంటూ సురేఖకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.