సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొత్త మలుపు’. భైరవి ఆర్థ్యా హీరోయిన్‌గా నటించింది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించగా, తాటి బాలకృష్ణ నిర్మించారు. జూన్ 12న సినిమా విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదలవుతోంది.
సోమవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌కు సీనియర్ నటుడు భానుచందర్, గాయని సునీత, నిర్మాత సి.కళ్యాణ్, నటుడు రఘుబాబు అతిథులుగా హాజరై టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా ఎమోషన్స్, సస్పెన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సహా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. యశ్వంత్ సంగీతం అందించాడు.
