హైదరాబాద్, వెలుగు: దేశ అభివృద్ధి, నాయకత్వం, ఆవిష్కరణల దిశగా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, ఇన్వెస్టర్లను ఒకే వేదికపైకి తెచ్చేందుకు హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో 'కేఆర్ భారత్ కాన్‌క్లేవ్–2026' ఆదివారం ఘనంగా జరిగింది. గ్రాడియెంట్ ఇన్ఫోటైన్‌మెంట్ దీనిని నిర్వహించింది.
"భారత్ విజన్ – భారత్ వాయిస్" నినాదంతో నిర్వహించిన ఈ సదస్సుకు సినీ నటి ప్రగ్యా నయన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యాపారం, సాంకేతికత, మీడియా, వినోద రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్న ఈ ఈవెంట్‌లో టీ-హబ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తాలూకా, గ్రాడియెంట్ ఫౌండర్ డా. విమల్ రాజ్ మాథూర్ తదితరులు పాల్గొన్నారు. కాన్‌క్లేవ్‌లో లీడర్‌షిప్ టాక్స్, స్టార్టప్ షోకేస్, ఇన్వెస్టర్ కనెక్ట్‌తో పాటు దేశాభివృద్ధికి తోడ్పడిన పలువురికి పురస్కారాలు అందించారు.
