V6 News

లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఇంటర్ రిజల్ట్స్లో ప్రతిభ చూపిన కృష్ణవేణి జూనియర్ స్టూడెంట్స్

లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఇంటర్ రిజల్ట్స్లో ప్రతిభ చూపిన కృష్ణవేణి జూనియర్ స్టూడెంట్స్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని కృష్ణవేణి జూనియర్ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించారని ఆ కాలేజీ డైరెక్టర్లు ఎం.కోటేశ్వర రావు, జి.జగదీశ్, వై.వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. సెకండ్ ఇయర్ ఎంపీసీలో కె.కావ్యకళ, ఎన్.చందన 995 మార్కులు, బీపీసీలో జి.ప్రహర్ష 994 మార్కులు సాధించారని తెలిపారు. 

జూనియర్ ఇంటర్ ఎంపీసీలో సీహెచ్.భావన 468, కె.పల్లవికి 467, ఎస్​కె.ఫాతిమాకు 466 మార్కులు సాధించగా, బీపీసీలో ప్రశాంత్ 437, సీఈసీలో గీతికకు 489 మార్కులు సాధించినట్టు పేర్కొన్నారు.