సీతా నవమిరోజు శ్రీరాముడి సమేతంగా

సీతా నవమిరోజు శ్రీరాముడి సమేతంగా

ఏప్రిల్ 29న సీతా నవమి సదర్బంగా "ఆదిపురుష్"(Adipurush) సినిమా నుంచి కృతి సనన్(Krithi sanon) ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. “అమరం, అఖిలం ఈ నామం, సీతారాముల ప్రియనామం” అంటూ దర్శకుడు ఓం రౌత్(Om routh), కృతి సనన్ పోస్టర్స్ విడుదల చేశాడు. ఈ పోస్టర్స్ లో కృతి సనన్, సీతాదేవిగా బాగా సరిపోయినట్లు కనిపిస్తోంది.

ఫస్ట్ లుక్ మాత్రమే కాదు మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో రెండు ఫొటోస్ ఉన్నాయి. అందులో ఒకటి సీత వెనుక రాముడు ఉన్న ఫోటో కాగా.. మరొకటి రాముడి తలపులతో కన్నీళ్లు పెట్టుకున్న సీత ఫోటో. ఈ రెండూ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని సొంతం చేసుకున్నాయి.

ప్రస్తుతం ఈ ఫొటోస్ అండ్ మోషన్ పోస్టర్స్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దీంతో ఆదిపురుష్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్న ఈ మూవీ.. జూన్ 16న ప్రేక్షకుల ముందుకి రానుంది.