
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల వార్ రూమ్ఇన్చార్జులతో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సమావేశం కానున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి హాజరుకావాలని అన్ని నియోజకవర్గాల ఇన్చార్జులకు సమాచారం ఇచ్చారు.
స్టేట్ వార్‌రూమ్ ఇన్చార్జులు సహా పార్టీ ఎలక్షన్ఇన్చార్జులకు ఎన్నికల ప్రచారంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? ప్రతిపక్షాల ప్రచారం ఎలా ఉంది? దాన్ని ఎలా డిఫెండ్ చేయాలి? బీఆర్ఎస్ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి? తదితర అంశాలపై కేటీఆర్, హరీశ్‌రావు దిశా నిర్దేశం చేయనున్నారు.