గౌడన్నల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్న కేటీఆర్

గౌడన్నల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్న కేటీఆర్

గౌడన్నల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నార్ననారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ జలవిహార్ లో జరిగిన తెలంగాణ గౌడ ఆత్మీయ సభకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ తో కలిసి హాజరయ్యారు. హరితహారం పేరుతో ఈత మొక్కలు నాటి.. కుల వృత్తిని ప్రోత్సహిస్తున్నామన్నారు కేటీఆర్. సభా వేదికపై నీరా తాగిన కేటీఆర్.. ఇకపై పెట్టుబడుల కోసం హైదరాబాద్ వచ్చిన విదేశీ ప్రతినిధులకు నీరా టేస్ట్ చూపిస్తా అన్నారు. గత ప్రభుత్వాలు గౌడ్స్ ను పట్టించుకోలేదన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. నీరా ప్రాజెక్ట్ ను ప్రభుత్వం తీసుకురావడంతో సంతోషంగా ఉందన్నారు.