బీఆర్ఎస్ ఆఫీస్ ఓపెనింగ్కు కేటీఆర్ గైర్హాజరు

బీఆర్ఎస్ ఆఫీస్  ఓపెనింగ్కు కేటీఆర్ గైర్హాజరు

ఢిల్లీలో భారతీయ రాష్ట్ర సమితి ఆఫీసును సీఎం కేసీఆర్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, UP మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి, తమిళనాడుకు చెందిన విడుతలై చిరుతైగల్ కచ్చి పార్టీ ఎంపీ చిదంబరంతో పాటు పలు రాష్ట్రాల రైతు సంఘం నాయకులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరుకాలేదు.

కేసీఆర్ కుటుంబంలో లుకలుకలు : రేవంత్

బీఆర్ఎస్ గా పేరు మారినంత మాత్రాన బుద్ధి మారదని  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇన్నేళ్లలో అవినీతిలో, అధికార దుర్వినియోగంలో, కుటుంబ పాలన విషయంలో ఎలాంటి మార్పు లేదన్నారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు పెరగటం.. ఒక్కరాష్ట్రంలో పంపకాల సమస్య వస్తుండటంతో  పేరు మార్చి కేసీఆర్ జాతీయపార్టీ అంటున్నాడని విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్నవాళ్లు ఇప్పుడు కేసీఆర్ వెంట వచ్చినా.. త్వరలోనే వాళ్ల భ్రమలు తొలగిపోతాయన్నారు. బీఆర్ఎస్ ఓపెనింగ్ కు కేటీఆర్ హాజరుకాలేదని..అపుడే కుటుంబంలో  ప్రకంపనలు మొదలయ్యాయని అన్నారు. కేసీఆర్ కూతురికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని.. కొడుకును దూరం పెట్టారనే ప్రచారం కూడా జరుగుతుందన్నారు.