బీజేపీ, బీఆర్ఎస్​ మధ్యనే ప్రధాన పోటీ: కేటీఆర్

బీజేపీ, బీఆర్ఎస్​ మధ్యనే ప్రధాన పోటీ:  కేటీఆర్

శామీర్ పేట, వెలుగు: కాంగ్రెస్​హైకమాండ్​మల్కాజిగిరి బరిలో డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందన్నారు. శామీర్‌పేట మండలం అలియాబాద్ లోని ఫంక్షన్​హాల్​లో మంగళవారం మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. కేటీఆర్​పాల్గొని బీఆర్ఎస్​అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో జరిగిన పొరపాట్లు రిపీట్​కాకుండా చూడాలన్నారు. నిజమైన సెక్యులర్ పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. ఈటల రాజేందర్ కు దమ్ముంటే మోదీ మల్కాజిగిరికి ఏం చేసిండో చెప్పి.. జనాన్ని ఓట్లు అడగాలన్నారు.

పదేండ్లు కంటోన్మెంట్ లో భూములు కావాలని అడిగితే పట్టించుకోలేదన్నారు. రేవంత్ రెడ్డి, బీజేపీ మల్కాజిగిరికి చేసింది గుండుసున్నా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు ఓటేస్తే.. బీజేపీకి ఓటేసినట్లేనన్నారు. ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. మల్కాజిగిరి పరిధిలో బీఆర్ఎస్​కు తిరుగులేదన్నారు. లక్ష్మారెడ్డి గెలుపు ఖాయమన్నారు. మేడ్చల్ బీఆర్ఎస్ ఇన్​చార్జ్ మహేందర్ రెడ్డి, మేయర్లు, మున్సిపల్​చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.