- రేవంత్ నిర్ణయంతో సికింద్రాబాద్ గుర్తింపు పోయేలా ఉంది: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజల అస్థిత్వానికి హైదరాబాద్, సికింద్రాబాద్ గొప్ప చిహ్నాలని.. కానీ, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో సికింద్రాబాద్‌కు ఉన్న చారిత్రక గుర్తింపు పోయేలా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్‌ను కార్పొరేషన్చేయాలని డిమాండ్ చేస్తూశనివారం బీఆర్ఎస్ర్యాలీ తలపెట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘‘మొదట టీఎస్ తీసేసి టీజీ అన్నారు. ఆ తర్వాత తెలంగాణ తల్లిని మార్చారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను తీసేశారు. అధికార చిహ్నం నుంచి కాకతీయ కళా తోరణాన్ని, చార్మినార్‌ను తీసేశారు. వీటితో ప్రజలకు ఏం లాభం జరిగిందో ప్రభుత్వం చెప్పాలి.
ఇలాంటివి తప్పించి రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు’’ అని విమర్శించారు. హైదరాబాద్ సిటీలో రెండేండ్లుగా సీఎం రేవంత్ రెడ్డి ఒక్క ఇటుక కూడా పెట్టలేదన్నారు. ఒక్కరోడ్డు, ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని కేటీఆర్ విమర్శించారు. తియుతంగా ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమైన తమను.. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారని కేటీఆర్మండిపడ్డారు. కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నాయకులను అరెస్ట్ చేశారని ఫైర్అయ్యారు. ఇంత అరాచకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం.. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.
పాలమూరు జిల్లాలను రద్దు చేసేందుకు కుట్ర
పాలమూరు జిల్లా బిడ్డను అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి.. పాలమూరు జిల్లాలను రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. శనివారం ఆయన తన నివాసంలో హరీశ్‌రావుతో కలిసి ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల అధ్యక్షులు, పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం, కృష్ణా జలాల వాటా వంటి కీలక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మున్సిపల్‌ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.
