హుజూర్ నగర్ ఉప ఎన్నికలో 50 శాతం ఓట్లు టీఆర్ఎస్ కు వస్తాయని తమ అంతర్గత సర్వే తెలిపిందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నియోజకవర్గంలో ప్రచారంపై పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు కేటీఆర్.. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..మరో వారం రోజులు మరింత ప్రణాళికాబద్ధంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించాలని కోరారు. గత ఎన్నికల్లోనూ కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు వలన టీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. కారు గుర్తుని ప్రజల్లోకి తీసుకు పోయేందుకు డమ్మీ ఈవీఎంలను ఉపయోగించుకోవాలని కోరారు. ఈ ఎన్నికతో బీజేపీ బలంమెంతో తేలిపోతుందన్నారు. ప్రజల మద్దతు లేదని తెలుసుకున్న బీజేపీ ,కాంగ్రెస్ పరోక్షంగా కలిసి పనిచేస్తున్నాయన్నారు కేటీఆర్.

