తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ఏప్రిల్ 30న ప్రారంభం కానుంది. కేసీఆర్ తన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. మంత్రి కేటీఆర్ రేపు సచివాలయంలో తనకు కేటాయించిన కార్యాలయంలోకి అడుగుపెట్టబోతున్నారు. నూతన సచివాలయంలో కేటీఆర్ కు కేటాయించిన మూడో అంతస్తులో నుంచి విధులు నిర్వర్తించనున్నారు.
కొత్త సచివాలయంలో విధులను ప్రారంభిస్తున్న సందర్భంగా మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లకు కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వుల పైలుపై తొలి సంతకం చేయనున్నారు.