హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ పదవితో, పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపించారు. తాను త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్లు ఆయన స్పషం చేశారు. ఈ విషయం గురించి చర్చించడానికి ఆయన ఢిల్లీ పెద్దల దగ్గరకు బయలుదేరారు.
‘నేను మూడు దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. 2009లో పార్టీ టికెట్ ఇవ్వకున్నా ఇండిపెండెంట్‌గా నిలిచి గెలిచాను. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన పోరాడాను. ఏడేళ్లుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా కూడా ప్రజాసమస్యలపై పోరాటం చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది. పీసీసీ చీఫ్ రాజీనామా చేస్తే కొత్త నాయకుడిని ఎన్నుకోలేకపోయారు. అంతర్గత గొడవల వల్లే పీసీసీ చీఫ్ ఎంపికలో ఆలస్యమవుతుంది. గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కాంగ్రెస్ కాపాడుకోలేకపోయింది. ప్రభుత్వంపై కాంగ్రెస్ పోరాటం చేయలేదని ప్రజలు భావిస్తున్నారు. అందుకు దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలే సాక్షాలుగా నిలిచాయి. ప్రజల తరపున పోరాటం చేయడం బీజేపీకి మాత్రమే సాధ్యమవుతుంది’ అని ఆయన అన్నారు.
For More News..

