లంగర్ హౌస్​లో 4.3 సెం.మీ అత్యధిక వర్షపాతం

లంగర్ హౌస్​లో 4.3 సెం.మీ అత్యధిక వర్షపాతం

సిటీలో ఆదివారం వాన దంచికొట్టింది. ఉదయం నుంచి ఆకాశం మబ్బు పట్టి ఉండి, సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. రెండు గంటల పాటు వాన పడగా.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మెయిన్​ రోడ్లు మొదలుకొని కాలనీల్లోనూ  నీరు నిలిచింది. ఆఫీసులు, స్కూళ్లకు సెలవు కావడంతో పెద్దగా ట్రాఫిక్ జామ్ సమస్య లేనప్పటికీ మాదాపూర్, అమీర్​పేట, చార్మినార్, పంజాగుట్ట లాంటి రద్దీ ప్రాంతాల్లో వాహనదారులకు కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. 

రోడ్లపై వరద నిలిచిపోవడంతో  ఇబ్బందులు ఏర్పడ్డాయి. లంగర్ హౌస్​లో అత్యధికంగా 4.3 సెం.మీ, ముషీరాబాద్ 4.3, మియాపూర్ 4.0, జుమ్మెరాత్ బజార్​లో 3.8, సరూర్ నగర్ లో 3.8 సెం.మీల వాన పడింది. మరో రెండ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.--