అమెరికా కుళ్లుకునేలా మాస్టర్ ప్లాన్.. ట్రంప్ టారిఫ్లకు ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేసిన ఇండియా

అమెరికా కుళ్లుకునేలా మాస్టర్ ప్లాన్.. ట్రంప్ టారిఫ్లకు ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేసిన ఇండియా

టారిఫ్ల పేరుతో పెద్ద దెబ్బ కొట్టాలని చూస్తున్న ట్రంప్కు షాకిచ్చే నిర్ణయం తీసుకునేందుకు ఇండియా సిద్ధమైంది. భారత ఎగుమతులపై 50 శాతం టారిఫ్స్ బుధవారం (ఆగస్టు 27) నుంచి అమలులోకి వచ్చిన క్రమంలో.. భారత్ మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. ఇప్పటికే యూఎస్ కు పోస్టల్ సర్వీసులు నిలిపివేసిన భారత్.. టారిఫ్ లకు ప్రత్యా్మ్నాయ మార్గాలను రెడీ చేసింది. ముఖ్యంగా టెక్స్టైల్, కెమికల్స్ పై యూఎస్ టారిఫ్స్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. ఆల్టర్నేట్ దారులను సిద్ధం చేసింది. 

యూఎస్ టారిఫ్స్ కారణంగా అమెరికాకు ఎగుమతి చేస్తున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆగిపోతే దాదాపు 48 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.3 లక్షల 98 వేల కోట్ల లాస్ వస్తుందనే అంచనాతో.. నష్టాన్ని పూడ్చుకునేందుకు వేరే మార్గాలను ఎంచుకుంది. 

రానున్న 72 గంటల్లో భారత్ తో వాణిజ్యం నిర్వహిస్తున్న వివిధ దేశాల ప్రతినిధులు, వ్యాపారులు, వాణిజ్య శాఖ అధికారులతో చర్చలు జరపనున్నారు. అయితే ట్రంప్ టారిఫ్స్ అమలుకు వచ్చిన క్రమంలో ఏదో ఒక నిర్ణయం ప్రకటించాలని ఇప్పటికే అమెరికా నుంచి ఒత్తిడి ఉంది. అయితే యూఎస్ ఒత్తిడికి తలొగ్గకుండా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేస్తోంది ఇండియా. 

ఇండియా మాస్టర్ ప్లాన్ లో భాగంగా.. 40 దేశాలతో చర్చలు జరపనుంది. జపాన్, ఇంగ్లండ్, యూరోపియన్ దేశాలు, ఆస్ట్రేలియా తదితర దేశాలతో చర్చలు జరిపి యూఎస్ కు కౌంటర్ ఇవ్వనుంది. భారత్ ఇప్పటి వరకు 200 కు పైగా దేశాలకు ఎగుమతులు చేస్తోంది. అందులో ఈ 40 దేశాల భాగస్వామ్యం ఎక్కువ. ఈ దేశాలన్నీ కలిసి రూ.52 లక్షల కోట్ల విలువైన టెక్స్ టైల్స్, అప్పీరల్స్ దిగుమతి చేసుకుంటున్నాయి.  హైక్వాలిటీ, దీర్ఘకాలిక మన్నిక, కొత్త రకం ప్రాడక్ట్స్ తో ముందుకెళ్లాలనే లక్ష్యంతో ఉంది. 

వీటితో పాటు ఇతర రంగాలకు సంబంధించిన ఎగుమతులను కూడా పెంచుకునే ప్లా్న్ లో ఇండియా ఉంది. రొయ్యలు, చేపలు, లెదర్ (తోళ్లు) మొదలైన వాటిని కూడా పెంచనుంది. ఇంగ్లండ్, ఫ్రాన్స్, జెర్మనీ దేశాలు లెదర్ ను మరింత దిగుమతి చేసుకోనున్నట్లు భావిస్తు్న్నారు. వీటితో పాటు ఆభరణాలు, రత్నాలు (జెమ్స్) ఎగుమతులను కూడా పెంచుకోవాలని చూస్తోంది. 

ఒకవైపు ఎగుమతులను పెంచుకుంటూనే లోకల్ వినియోగాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక వినియోగం పెంచడం వలన విదేశాల నుంచి వచ్చే ఇలాంటి ఒత్తిడిని తట్టుకోవచ్చు. అందుకోసం జీఎస్టీ రేట్లను తగ్గించే ప్లాన్ లో ఉన్నారు. రోజూవారి తప్పనిసరి వస్తువుల నుంచి కార్లు, కిచెన్ సామాగ్రి ధరలు సైతం దీపావళిలోపే  తగ్గించాలని భావిస్తున్నారు. 

అయితే యూఎస్ కు ఎగుమతి చేస్తున్న వాటిలో 30.2 శాతం అంటే రూ.2.37 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు ఫ్రీ డ్యూటీ కిందే ఉన్నాయి. ఫార్మా ఉత్పత్తులు, ఫార్మా ఇంగ్రీడియంట్స్ మొదలైనవి టారిఫ్ లకు అతీతంగా యూఎస్ కు ఎగుమతి యదావిధిగా కొనసాగుతుంది. 

రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న కారణంగా యూఎస్ అదనంగా మరో 25 శాతం టారిఫ్ విధించిన విషయం తెలిసిందే. మొత్తం 50 శాతం టారిఫ్ లు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి.