డేంజర్లో పోచారం ప్రాజెక్టు.. భయాందోళనలో 14 గ్రామాలు

డేంజర్లో పోచారం ప్రాజెక్టు.. భయాందోళనలో 14 గ్రామాలు

కామారెడ్డి జిల్లాలో కురిసిన కుండపోత వర్షాలకు జిల్లా అంతా అతలాకుతలం అయ్యింది. చెరువులు, కుంటల నిండి వాగులు నదుల మాదిరిగా ప్రవహిస్తున్నాయి. దీంతో నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. అన్ని గేట్లు ఎత్తి నీళ్లు కిందికి పంపుతున్నారు. కానీ భారీ ఎత్తున వస్తున్న వరదకు ప్రాజెక్టు పై నుంచి దూకుతుండటంతో ఆందోళనకరంగా మారింది పరిస్థితి.

గతంలో ఎన్నడూ లేనంతగా వర్షం పడుతుండడంతో బుధవారం (ఆగస్టు 27)  ఒక లక్ష 15 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1.82 టీయంసీలు. దీంతో ఇప్పటికే  ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. 

►ALSO READ | రెయిన్ ఎఫెక్ట్.. రేపు (ఆగస్టు 28) ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు

ప్రాజెక్టు నిండటంతో వరద నీరు డ్యాం పై నుంచి దూకుతున్నాయి. మరోవైపు ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్టు ఓవర్ హెడ్ వద్ద బుంగ ఏర్పడింది. దీంతో ఏ క్షణమైనా ప్రాజెక్ట్ కు ప్రమోదం సంభవించవచ్చునని అధికారులు ప్రకటించారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దాదాపు 14 గ్రామాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. 

ప్రస్తుతం ప్రాజెక్టు ఓవర్ హెడ్ వద్ద బుంగ ఏర్పడింది. ఏదైనా జరగకూడది జరిగితే  ప్రాజెక్ట్ ప్రమాదంలోకి వెళ్తుందని చెబుతున్నారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత స్థలాలకు తరలిస్తున్నారు అధికారులు.