
భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. కుండ పోత వర్షాలతో ఎన్నడూ లేనంతగా వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు గ్రామాలు, పట్టణాల్లోని కాలనీలు మునగిపోయాయి. చెరువులు అలుగెల్లి పారుతుండటంతో వాగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల్లో కార్లు, పలు వాహనాలు కొట్టుకుపోయాయి. వరదల్లో ఇప్పటికే పలవురు గల్లంతయ్యారు. వానలో చిక్కుకున్న వాళ్లను కాపాడేందుకు విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి.
వర్షాలు కొన్ని జిల్లాలో మరింతగా కురిసే అవకాశం ఉందని బుధవారం (ఆగస్టు 17) వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే మెదక్, కామారెడ్డి జలవియంలో చిక్కుకోగా.. రానున్న 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అదే విధంగా మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
►ALSO READ | కామారెడ్డి జిల్లాలో వరదల్లో చిక్కుకొని ట్యాంకర్ ఎక్కిన కార్మికులు.. కాపాడి ఒడ్డుకు చేర్చిన ఎన్డీఆర్ఎఫ్..
మంగళ, బుధవారాల్లో కురిసిన వానలకు మెదక్, కామారెడ్డి జిల్లాలు జలదిగ్బంధంలో కూరుకుపోయాయి. హైదరాబాద్ నుంచి మెదక్, కామారెడ్డి హైవేలు వరదలతో బ్లాక్ అయిపోయాయి. కొన్ని ఊర్లకు రాకపోకలు బందయ్యాయి. రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. వరదలు నదులను గుర్తు చేస్తూ ప్రవహిస్తున్నాయి. దీంతో మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని స్కూళ్లు కాలేజీలకు రేపు (ఆగస్టు 28) సెలవు ప్రకటించారు.