కామారెడ్డి జిల్లాలో వరదల్లో చిక్కుకొని ట్యాంకర్ ఎక్కిన కార్మికులు.. కాపాడి ఒడ్డుకు చేర్చిన ఎన్డీఆర్ఎఫ్..

కామారెడ్డి జిల్లాలో వరదల్లో చిక్కుకొని ట్యాంకర్ ఎక్కిన కార్మికులు.. కాపాడి ఒడ్డుకు చేర్చిన ఎన్డీఆర్ఎఫ్..

గత 24 గంటల్లో తెలంగాణలోని చాల జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు వరదలతో ముంచెత్తాయి.  కొన్ని జిల్లాల్లో ఇప్పటికే రోడ్లు రాకపోకలకి  అంతరాయం ఏర్పడగా, రైళ్లు  కూడా  నిలిచిపోయాయి.  అయితే ఒడిశాపై ఏర్పడిన అల్పపీడనం కారణంగా గురువారం మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి.  

దింతో కామారెడ్డి జిల్లా  నిజాంసాగర్  మండలంలోని బొగ్గు గుడిసె వద్ద  ఓ బ్రిడ్జి పనులు జరుగుతున్న చోట ఒక్కసారిగా వరద ఉదృతి పెరగటంతో  అక్కడ పనిచేస్తున్న కూలీలు వరదలో చిక్కుకున్నారు.  ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్న వరద కారణం  ప్రాణ భయంతో ట్యాంకర్ పైకి ఎక్కారు. స్థానికుల సమాచారంతో అక్కడి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది  ఈ 8 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. 

►ALSO READ | మెదక్, కామారెడ్డి జిల్లాలను ముంచెత్తిన వానలు.. వరదలో చిక్కుకున్న 12 మంది, ఇద్దరు గల్లంతు..

మెదక్ జిల్లా టేక్మాల్‌లో 183.3 మిల్లీమీటర్లు, బోడగట్ ఈఎస్‌ఎస్‌లో 176.8, శంకరంపేటలో 171.8 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది.  కామారెడ్డిలోని లింగంపేట్, లింగంపల్లిలో 120.3 మి.మీ, యాదాద్రి భువనగిరిలోని 117.8 మి.మీ నమోదైంది.  రానున్న గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.