మెదక్, కామారెడ్డి జిల్లాలను ముంచెత్తిన వానలు.. వరదలో చిక్కుకున్న 12 మంది, ఇద్దరు గల్లంతు..

మెదక్, కామారెడ్డి జిల్లాలను ముంచెత్తిన వానలు.. వరదలో చిక్కుకున్న 12 మంది, ఇద్దరు గల్లంతు..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వాగులు వరదలై పొర్లుతుంది. దింతో  మెదక్ జిల్లా హావేలిఘనపూర్ (మం) రాజీపేట తండా వద్ద వాగులో ఓ ఆటోలో ఉన్న  8 మంది  కొట్టుకుపోగా, ప్రాణాలతో బయటపడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే  ఇప్పటికే మెదక్ చేరుకున్న కామారెడ్డి DRF బృందాలు  సహాయక చర్యలు ముమ్మరం చేసాయి, అలాగే  వాతావరణం అనుకూలిస్తే హెలికాప్టర్ తో సహాయక చర్యలు చేపట్టనున్నారు. 

మరోవైపు హావేలి ఘనపూర్ (మం) నాగపూర్ వద్ద వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. దింతో కారులో ఉన్న నలుగురు బయటపడి చెట్టుని పట్టుకుని సహాయం కోసం చూస్తున్నారు. 

►ALSO READ | రెడ్ అలర్ట్: మరో రెండు గంటలు జాగ్రత్త.. బయటకు రావద్దు

మెదక్ జిల్లాలో వేర్వేరు చోట్ల వరదల్లో చిక్కుకున్న 12 మందిలో ఇద్దరు గల్లంతయ్యారు. అయితే వరదల్లో చిక్కుకున్న ఇద్దరు ఓ చెట్టుని పట్టుకుని ఉండగా వరద ఉధృతికి  చెట్టుతో సహా ఆ ఇద్దరు కొట్టుకుపోయారు. అయితే మరో 10 మందిలో ఒకరిని రక్షించిన DRF టీం మిగిలిన 9 మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తన్నారు. దింతో మెదక్, కామారెడ్డి జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.