అమెరికాలో స్కూల్లో కాల్పులు.. ముగ్గురు మృతి.. 20 మందికి గాయాలు

అమెరికాలో స్కూల్లో కాల్పులు.. ముగ్గురు మృతి.. 20 మందికి గాయాలు

అమెరికాలో గన్ కల్చర్ అప్పుడప్పుడు పడగ విప్పుతూనే ఉంది. అమాయకుల ప్రాణాలు బలవుతూనే ఉన్నాయి . బుధవారం (ఆగస్టు 27) మిన్నెసోటా లో స్కూల్లో జరిగిన కాల్పులు కలకలం రేపాయి. మినియపోలిస్ క్యాథలిక్ స్కూల్ లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలైనట్లు గవర్నర్ టిమ్ వాల్జ్ తెలిపారు. చనిపోయిన వారిలో షూటర్ కూడా ఉండటం గమనార్హం. 

యానుసియేషన్ క్యాథలిక్ చర్చికి అనుసంధానంగా ఉన్న స్కూల్ ప్రారంభమైన రెండు రోజుల్లోనే కాల్పుల జరిపారు దుండగులు. ఈ స్కూల్లో మొత్తం 395 మంది విద్యార్థులు చదువుతున్నారు. కాల్పుల జరిగిన తర్వాత గవర్నర్ వాల్జ్ ఘటనకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. స్కూల్ ప్రారంభమైన తొలి వారంలోనే ఈ ఘటన జరగటం దారుణం అన్నారు. 

ఘటన జరిగిన వెంటనే ఫెడరల్ ఏజెంట్లు, అంబులెన్స్ స్కూల్ కు చేరుకున్నాయి. వెంటనే గాయపడిన విద్యార్థులను ఆస్పత్రులకు తరలించారు. ఆ తర్వాత స్కూల్లో విద్యార్థులను ఖాలీ చేయించారు. 

►ALSO READ | కళ్లు బైర్లు కమ్ముతాయని హెచ్చరించా.. 5 గంటల్లోనే యుద్ధం ఆపేశారు: ఇండియా-పాక్ వార్‎పై ట్రంప్

పరిస్థితి అదుపులో ఉందని ప్రసిడెంట్ ట్రంప్ ట్రూత్ సోషల్ లో ప్రకటించారు. సిచువేషన్ ను వైట్ హౌస్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని తెలిపారు.