
వినాయక చవితి పండుగను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భక్తిశ్రద్ధలతో గణపతిని ప్రతిష్టించి, పూలు, పండ్లు, రకరకాల నైవేద్యాలను సమర్పించి స్వామివారి ఆశీస్సులు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఈ పండుగను టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు, హీరోయిన్లు ఘనంగా జరుపుకున్నారు. తమ ఇంటిలో గణపతిని ప్రతిష్టించి, సంప్రదాయబద్ధంగా పూజలు చేసి, ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ పోస్ట్‌లు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
స్టార్ హీరోల పండుగ వేడుకలు
మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబంతో కలిసి వినాయక చవితి పూజలో పాల్గొన్నారు. తన ఇంటిలో ప్రతిష్టించిన గణేషుడికి హారతి ఇస్తున్న వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. "ప్రకృతి స్వరూపుడు, సర్వ గణాలకు అధిపతి, సకల శుభాలను అనుగ్రహించే శ్రీగణేశుని ఆశీస్సులతో... అందరం ఆయురారోగ్య, సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రార్థిస్తూ.. వినాయకచవితి పండుగ శుభాకాంక్షలు" అని అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్ట్ మెగా అభిమానులను ఆకట్టుకుంది.
మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ గణపతి పండుగ వేడుకల ఫోటోను షేర్ చేశారు. 'బప్పా (వినాయకుడు) ఇంటికి వచ్చాడు. మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. అందరికీ ప్రేమ, శాంతి మరియు శ్రేయస్సు కలగాలని కోరుకుంటున్నాను! మహేష్ బాబు ని చాలా మిస్ అవుతున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు' అని నమ్రతా తన పోస్ట్ లో పేర్కొన్నారు. షూటింగ్ నిమిత్తం దూరంగా ఉన్న మహేష్‌ను మిస్ అవుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
నాని తన కొడుకు అర్జున్‌తో కలిసి గణపతి పూజలు చేశారు. అర్జున్ క్యూట్‌గా గణపతి పాట పాడుతున్న వీడియోను నాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన అభిమానులు, 'సూపర్ క్యూట్' అంటూ కామెంట్లు చేశారు
లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం తన ఇంట్లో గణపతిని ప్రతిష్టించి, సంప్రదాయ వస్త్రధారణలో పూజలు చేశారు. ఆయన కుటుంబంతో కలిసి పూజలు నిర్వహిస్తున్న ఫోటోలు అందరినీ ఆకట్టుకున్నాయి.
నటి అనసూయ తన కుటుంబంతో కలిసి వినాయక చవితిని జరుపుకున్నారు. ఆమె తన ఇంటిలో గణపతిని ప్రతిష్టించి, పూజలు చేస్తున్న ఫోటోలను షేర్ చేసుకున్నారు.
మెగా కోడలు లావణ్య త్రిపాఠి తన భర్త వరుణ్ తేజ్‌తో కలిసి గణపతి పూజలో పాల్గొంది. ప్రెగ్నెంట్ కావడంతో కుర్చీలో కూర్చొని పూజలో పాల్గొంటున్న ఫోటో అభిమానులను ఆకట్టుకుంది.
నటి హన్సిక తన భర్త సోహెల్‌తో కాకుండా ఒంటరిగా వినాయకుడిని పూజించింది. సాంప్రదాయ దుస్తుల్లో పూజ చేస్తున్న ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో ఆకర్షణీయంగా ఉన్నాయి.
ఈ విధంగా టాలీవుడ్ ప్రముఖులు తమ పండుగ వేడుకల ఫోటోలను, వీడియోలను షేర్ చేసుకుని అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు తమ అభిమాన నటులకు వినాయచవితి శుభాకాంక్షలు చెబుతూ.. వారి సింప్లిసిటీ ప్రశంసలు కురిపిస్తున్నారు.