
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సతీమణి లావణ్య త్రిపాఠి త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మే నెలలో ప్రకటించినప్పటి నుంచి ఈ మెగా కోడలిపై అందరి దృష్టి పడింది. ఈ రోజు ( ఆగస్టు 27న ) వినాయక చవితి సందర్భంగా లావణ్య షేర్ చేసిన ఒక ప్రత్యేకమైన ఫోటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
లావణ్య తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలో, ఆమె తన భర్త వరుణ్ తేజ్‌తో కలిసి వినాయకుడి ముందు కూర్చుని ఉంది. ఈ ఫోటోలో వరుణ్ తేజ్ నేలపై కూర్చోగా, గర్భవతి అయిన లావణ్య కుర్చీపై కూర్చుని రెండు చేతులతో దేవుడికి నమస్కరిస్తోంది. కెమెరా వైపు చూస్తూ చిరునవ్వు చిందిస్తున్న లావణ్య బేబీ బంప్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వరుణ్ తేజ్, లావణ్యల ప్రేమ ప్రయాణం 'మిస్టర్' సినిమాతో మొదలైంది. ఆ సినిమాలో జంటగా నటించిన వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో 2023లో ఇటలీలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో రిసెప్షన్ జరుపుకున్నారు. పెళ్లి తర్వాత వెండితెరకు కొంత దూరంగా ఉన్న లావణ్య, 'పులిమేక', 'మిస్ పర్ఫెక్ట్' వంటి వెబ్ సిరీస్‌లతో ఓటీటీలో సందడి చేసింది. ఇటీవల'సతీ లీలావతి' సినిమాలో నటించింది. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ ఫోటో చూసిన మెగా అభిమానులు లావణ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. లావణ్య తల్లిగా ప్రమోషన్ పొందబోతున్న ఈ శుభ సందర్భం మెగా ఫ్యామిలీలో సంతోషాన్ని మరింత పెంచుతోంది.