పురుషుల మ్యాచ్‌కు తొలి మహిళా అంపైర్‌గా లారెన్‌

పురుషుల మ్యాచ్‌కు తొలి మహిళా అంపైర్‌గా లారెన్‌

దక్షిణాఫ్రికా మాజీ వుమెన్స్‌ క్రికెటర్‌ లారెన్‌ ఏజెన్‌బాగ్‌… పురుషుల ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌కు తొలి మహిళా అంపైర్ గా  ఎంపికయ్యారు. ఇప్పటికే మహిళల టీ20 ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ ఫైనల్‌ మ్యాచ్‌తో పాటు ప్లేఆఫ్‌ మ్యాచ్‌లకు అంపైర్‌గా  లారెన్… ఇప్పుడు పురుషుల మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించనున్నారు. దక్షిణాఫ్రికా ఫస్ల్‌క్లాస్‌ మ్యాచ్‌కు లారెన్‌ను అంపైర్‌గా నియమిస్తూ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ICC) నిర్ణయం తీసుకుంది. దాంతో పురుషుల ఫస్ల్‌క్లాస్‌ మ్యాచ్‌కు ఎంపికైన తొలి  ఉమెన్ అంపైర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు.

మిగతా మహిళా క్రికెటర్లకు ఆమె ఒక స్ఫూర్తిగా నిలిచిపోతుందని దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు తాత్కాలిక డైరెక్టర్‌ కోరీ వాన్‌ జిల్‌ ప్రశంసించారు. ICC మహిళా అంపైర్ల ప్యానల్‌లో సభ్యురాలిగా ఉన్న లారెన్‌…వరల్డ్‌ టీ20లో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించారు.