
కాంగ్రెస్,టీఆర్ఎస్ పార్టీలు రెండు దొంగలేనని అన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్. సంపాదనే ధ్యేయంగా తెలంగాణ ప్రజలను కేసీఆర్ దోచుకుంటున్నారని విమర్శించారు. గోదావరిఖని పెద్దపెల్లిలో జరిగిన బీజేపీ సమావేశంలో లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన లక్ష్మణ్.. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని.. కేసీఆర్ సింగరేణి కార్మికులకు ద్రోహం చేసి, వారి హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు లక్ష్మణ్.
మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ తుగ్లక్ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్.. కమీషన్ల కోసం ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని అన్నారు. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ నమ్మకద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ ను సీఎం చేసేందుకు కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ ను నిర్మిస్తున్నారని అన్నారు వివేక్ వెంకట స్వామి.