నయన్ రాక్స్‌‌.. వరుస సినిమాలతో బిజీ బిజీ

నయన్ రాక్స్‌‌.. వరుస సినిమాలతో బిజీ బిజీ

భాషతో పని లేదు. నయనతార నటిస్తోందంటే ఆ సినిమాపై బజ్ క్రియేటవ్వకుండా ఉండదు. డిఫరెంట్ కాన్సెప్టులతో, స్ట్రాంగ్ రోల్స్‌‌తో ఓ సెపరేట్ దారిలో వెళ్తోంది. అందుకే లేడీ సూపర్‌‌‌‌ స్టార్ అయ్యింది. ప్రస్తుతం నాలుగు భాషల్లో బ్యాక్‌‌ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీబిజీగా ఉంది నయన్. తెలుగులో చిరంజీవికి చెల్లెలుగా ‘గాడ్‌‌ఫాదర్‌‌‌‌’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో షారుఖ్‌‌ హీరోగా అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రంలో యాక్ట్ చేస్తోంది. మలయాళంలోనూ ఓ మూవీకి కమిటయ్యింది. ఇక తమిళంలో అయితే మరింత బిజీ. 

అశ్విన్ శరవణన్ డైరెక్షన్‌‌లో ‘కనెక్ట్’ అనే హారర్ చిత్రంలో నటిస్తున్న నయన్.. జీఎస్ విఘ్నేష్‌‌ డైరెక్షన్‌‌లోనూ  ఓ సినిమాకి ఓకే చెప్పింది. విజయ్ సేతుపతి, సమంతలతో కలిసి ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ మూవీ చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి నిన్న డబ్బింగ్ చెప్పడం కూడా స్టార్ట్ చేసింది. ఆమెకి కాబోయే భర్త విఘ్నేష్ శివన్​ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. నయన్ డబ్బింగ్ మొదలు పెట్టినట్టు తనే అనౌన్స్ చేశాడు. ఈ మూవీలో సమంత నెగిటివ్ రోల్ చేయబోతోందనే వార్తలు వచ్చాయి. కానీ నిజానికి నయన్ పాత్రే నెగిటివ్‌‌గా ఉంటుందనేది లేటెస్ట్ టాక్. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా.. చేస్తున్నది నయనతార కాబట్టి ఎక్స్‌‌పెక్టేషన్స్‌‌ పీక్స్‌‌లో ఉంటాయనడంలో డౌటే లేదు.