లెస్బియన్ కాన్సెప్ట్‌‌ చాలా కొత్తగా ఉంటుంది : ఆర్జీవీ

లెస్బియన్ కాన్సెప్ట్‌‌ చాలా కొత్తగా ఉంటుంది : ఆర్జీవీ

అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో రామ్‌‌గోపాల్ వర్మ రూపొందించిన  చిత్రం ‘డేంజరస్’. డిసెంబర్ 9న సినిమా రిలీజ్ అవుతోన్న సందర్భంగా వర్మ మాట్లాడుతూ ‘కొన్ని వందల, వేల సినిమాల్లో అమ్మాయి, అబ్బాయిని ప్రేమికులుగా చూసుంటాం. ఎక్స్‌‌పెరిమెంటల్‌‌గా ఉంటుందని ఇద్దరమ్మాయిల మధ్య ప్రేమకథతో ఈ సినిమా తీశా. లెస్బియన్ కాన్సెప్ట్‌‌ చాలా కొత్తగా ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడకపోవచ్చు కానీ, ఫ్యామిలీలో ఒక్కొక్కరు వెళ్లి చూస్తారు. 

అప్సర రాణి, నైనా గంగూలీ బాగా నటించారు. ఇలాంటి రోల్స్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఇద్దరూ కలిసి అనుకోకుండా ఓ క్రైమ్ చేస్తారు. దాన్నుండి తప్పించుకోవడానికి ఎలాంటి డేంజరస్ సిచ్యుయేషన్స్ ఎదుర్కొన్నారనేది మెయిన్ స్టోరీ. రియలిస్టిక్‌‌గా యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి. రొమాన్స్ ఎంత ఉంటుందో, యాక్షన్ పార్ట్ కూడా అంతే ఉంటుంది. ఇక నానెక్స్ట్ ప్రాజెక్ట్‌ ‘వ్యూహం’ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన ఘట్టం నుంచి సినిమా మొదలవుతుంది. దానికి సెకెండ్ పార్ట్ గా ‘శపథం’ తీస్తాను. కేసీఆర్ బయోపిక్‌‌కి టైమ్ పడుతుంది. అమితాబ్‌‌తోనూ ఓ సినిమా ఉంటుంది’ అన్నారు.