2026ను ప్రజా ఉద్యమంగా మార్చుకుందాం..దేశ ప్రజలకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పిన ఖర్గే, రాహుల్

2026ను ప్రజా ఉద్యమంగా మార్చుకుందాం..దేశ ప్రజలకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పిన ఖర్గే, రాహుల్

న్యూఢిల్లీ: దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ న్యూఇయర్ శుభాకాంక్షలు చెప్పారు. తమ అధికారిక ఎక్స్ ఖాతాల ద్వారా విషెస్ తెలియజేశారు. ఖర్గే తన పోస్ట్‌‌లో " ప్రియమైన దేశ పౌరులారా! 2026 న్యూఇయర్ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 

ఈ ఏడాదిని బలహీన వర్గాల హక్కులను రక్షించే ఉద్యమంగా మార్చుకుందాం. పని హక్కు, ఓటు హక్కు, గౌరవంగా జీవించే హక్కులను కాపాడుకునేందుకు పోరాడుదాం. మన రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలను రక్షిద్దాం. పౌరులను శక్తిమంతం చేద్దాం. సమాజంలో సామరస్యాన్ని బలోపేతం చేద్దాం. యువతకు ఉపాధి, మహిళలకు భద్రత, రైతులకు శ్రేయస్సు, అణగారిన వారికి గౌరవం, అందరికీ మెరుగైన జీవన నాణ్యత అనేవి మన సంకల్పాలు కావాలి. 

ఈ ఏడాది మీ అందరికీ ఆనందం, భద్రత, పురోగతిని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను" అని పేర్కొన్నారు. అలాగే రాహుల్ గాంధీ స్పందిస్తూ.."మీ అందరికీ నూతన సంవత్సరం 2026 శుభాకాంక్షలు. కొత్త ఏడాది మీ జీవితాల్లో ఎనలేని ఆనందాన్ని, మంచి ఆరోగ్యాన్ని, విజయాలను అందించాలని కోరుకుంటున్నా. అందరికీ మరో సారి హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు!" అని పేర్కొంటూ ట్వీట్ చేశారు.