కాస్త కొత్తగా మ్యాగీ మిల్క్​షేక్

V6 Velugu Posted on Sep 21, 2021

చాక్లెట్​,  యాపిల్​, సీతాఫల్​, వెనిల్లా, బోర్బన్​..ఇలా రకరకాల ఫ్లేవర్​ మిల్క్​ షేక్స్​  మనలో చాలామంది టేస్ట్​​ చేసే ఉంటారు. అయితే ఈసారి కాస్త కొత్తగా  మ్యాగీ మిల్క్​షేక్​ ట్రై చేద్దామా. మ్యాగీ మిల్క్​షేకా? అని ఆశ్చర్యపోవద్దు.  ఇదేదో జోక్​ అని కొట్టిపారేయొద్దు.  మ్యాగీ మిల్క్​ షేక్​కి ట్విట్టర్​లో మస్త్​ డిమాండ్​ ఉంది. అవును.. ఈ మ్యాగీ మిల్క్​షేక్​కి సంబంధించిన ఫొటోలు ట్విట్టర్​లో ఫుల్​ ట్రెండ్​ అవుతున్నాయి ఇప్పుడు. ఈ మిల్క్​ షేక్​ ఎవరు తయారుచేశారో, ఎక్కడ అమ్ముతున్నారో తెలియదు. కానీ, ట్విట్టర్​లో ఈ రెసిపీపై జోకులు మాత్రం టపాసుల్లా పేలుతున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కోలా రెస్పాండ్​ అవుతూ ఈ మిల్క్​ షేక్​ తయారుచేసిన వాళ్లని వెతికి పట్టుకోమని ట్విట్టర్​లో​ రిక్వెస్ట్​ చేస్తున్నారు.
 

Tagged new, , Maggie, milkshake

Latest Videos

Subscribe Now

More News