V6 News

KCR కారులో మజ్లీస్ సవారీ : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

KCR కారులో మజ్లీస్ సవారీ : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

మజ్లిస్ కు భయపడే విమోచన దినోత్సవాన్ని TRS సర్కార్ జరపడం లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. KCR కారులో మజ్లిస్ సవారీ చేస్తుందని ఆయన విమర్శించారు. పటేల్ చేపట్టిన సైనిక చర్య వల్లే నిజాం నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిందన్నారు జోషి. తెలంగాణ ప్రజల పోరాటానికి ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17న పండుగలా జరుపుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.

తెలంగాణ పోరాట చరిత్రను కేసీఆర్ ప్రజలకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, విద్యాసాగర్ రావు, వివేక్ వెంకస్వామి, డీకే అరుణతో పాటు బీజేపీ నేతలు పాల్గొన్నారు.