V6 News

MIvsGT: టాస్ ఓడిన ముంబై.. గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుని పెద్ద తప్పు చేసిందా..?

MIvsGT: టాస్ ఓడిన ముంబై.. గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుని పెద్ద తప్పు చేసిందా..?

అహ్మదాబాద్: ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో.. ముంబై ఇండియన్స్ జట్టు తొలుత బ్యాటింగ్కు దిగనుంది. గాయం కారణంగా ముంబై ఇండియన్స్ జట్టుకు దూరమైన రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు కూడా దూరంగానే ఉన్నాడు. ముంబై జట్టులో డానిష్ మలేవార్ ఈ మ్యాచ్తో అరంగేట్రం చేశాడు. గుజరాత్ టీంలో.. రాహుల్ తెవాటియా స్థానంలో షారూఖ్ ఖాన్ ఆడనున్నాడు.

ఇక.. అహ్మదాబాద్ పిచ్ విషయానికొస్తే.. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 212. ఈ స్టేడియంలో ఐపీఎల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు 8 మ్యాచ్లు గెలవగా, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 3 మ్యాచులు మాత్రమే గెలిచాయి. ఈ సీజన్లో ఐదు మ్యాచులు ఆడి ఒక్క మ్యాచ్లో మాత్రమే గెలిచి నాలుగు మ్యాచుల్లో ఓడిన ముంబై జట్టు ఈ మ్యాచ్లో గెలిచి మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తుండగా.. హ్యాట్రిక్ విజయాలతో జోరు మీద ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టు ముంబైని ఓడించి ఈ మ్యాచ్ను కూడా ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది.

ముంబై ఇండియన్స్: డానిష్ మలేవార్, క్వింటన్ డీ కాక్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా (కెప్టెన్), తిలక్ వర్మ, రూథర్ ఫర్డ్, శాంట్నర్, క్రిష్ భగత్, బుమ్రా, మహ్మద్ ఘజన్ఫర్

గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, షారూక్ ఖాన్, రషీద్ ఖాన్, సిరాజ్, రబడ, అశోక్ శర్మ, ప్రసీద్ కృష్ణ