17న లైబ్రెరియన్ ఎగ్జామ్​... సీబీఆర్‌‌టీ మోడ్‌‌లో పరీక్ష

17న లైబ్రెరియన్ ఎగ్జామ్​... సీబీఆర్‌‌టీ మోడ్‌‌లో పరీక్ష

హైదరాబాద్‌‌, వెలుగు:  లైబ్రెరియన్‌‌ పోస్టుకు సంబంధించిన పరీక్షను యథావిధిగా మే 17న నిర్వహించనున్నట్లు టీఎస్‌‌పీఎస్సీ వెల్లడించింది. సీబీఆర్‌‌టీ మోడ్‌‌లో పరీక్ష ఉంటుందని తెలిపింది. లైబ్రెరియన్‌‌ పోస్టు కు దరఖాస్తు చేసుకున్న వారు వెబ్​సైట్​లో ఎగ్జామ్​కు వారం ముందు హాల్‌‌ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. 

లాసెట్ కు ఇయ్యాల్నే లాస్ట్ డేట్   

లాసెట్‌‌, పీజీఎల్‌‌సెట్‌‌ 2023 ప్రవేశ పరీక్షలకు లేట్ ఫీజు లేకుండా దరఖాస్తులకు గడువు శనివారం నాటితో ముగియనుంది. అయితే, రూ. 500 లేట్ ఫీజుతో మే 4 వరకు, రూ. 1000 లేట్ ఫీజుతో 8 వరకు, రూ. 2 వేల లేట్ ఫీజుతో 10 వరకు, రూ. 4 వేల లేట్ ఫీజుతో మే 12 వరకు గడువును ఇచ్చారు. లాసెట్‌‌, ఎల్‌‌ఎల్‌‌ఎం ప్రవేశ పరీక్షలు మే 25న నిర్వహించనున్నారు.