హైద‌రాబాద్ లో 10 మెడిక‌ల్ షాపుల లైసెన్సులు ర‌ద్దు

హైద‌రాబాద్ లో 10 మెడిక‌ల్ షాపుల లైసెన్సులు ర‌ద్దు

హైదరాబాద్​లో పలు మెడికల్​ షాప్​లపై డ్రగ్​కంట్రోల్​ అథారిటీ, నార్కోటిక్​ డ్రగ్స్​ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించి నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకున్నారు. ఎలాంటి ప్రిస్క్రిప్షన్​లేకుండా మందులు విక్రయిస్తూ ఎంఆర్​పీ ధరకు మించి వసూలు చేస్తున్న పది షాపుల లైసెన్సులను రద్దు చేశారు. కొన్ని దుకాణాల లైసెన్స్​లను సస్పెండ్​ చేశారు.

ఆల్​ప్రాజోలం ట్యాబ్లెట్ల వంటి షెడ్యూల్డ్​ మందులను డాక్టర్​ ప్రిస్క్రిప్షన్​తో మాత్రమే ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తున్న మెడికల్​షాపులపై ఇకముందూ చర్యలు తప్పవని హెచ్చరించారు. కోటి ఇందర్‌బాగ్‌లోని గణేష్ ఫార్మాస్యూటికల్స్, అంబర్‌పేటలోని బయోస్పియర్ ఎంటర్‌ప్రైజెస్, అక్షయ మెడికల్, జనరల్ స్టోర్‌ల లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దు చేశారు.