
హైదరాబాద్: భాగ్య నగరంలో మళ్లీ వర్షం మొదలైంది. ఒకట్రెండు రోజులు కాస్త గ్యాప్ ఇచ్చినప్పటికీ మంగళవారం సాయంత్రం చిరు జల్లులు సిటీని పలకరించాయి. వాతావరణ శాఖ మంగళవారం సాయంత్రం 4:45కి వెల్లడించిన సమాచారం ప్రకారం.. హైదరాబాద్లో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య చిన్నపాటి జల్లులతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది.
హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో తదుపరి 2-3 గంటల్లో గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీ కంటే తక్కువ (గాలులలో) తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం.. ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షం వచ్చే అవకాశం వుంది.
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, సూర్యాపేట, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి వర్షం ఒకటి రెండు చోట్ల వచ్చే అవకాశం వుంది.
►ALSO READ | హైదరాబాద్లో వర్షం స్టార్ట్.. సిటీ ప్రజలకు జీహెచ్ఎంసీ కీలక సూచన
రాష్టానికి వాతావరణ శాఖ ఇప్పటికే మరో రెండు రోజులు వర్ష సూచన చేసిన సంగతి తెలిసిందే. వాయువ్య బంగాళాకతం ఉత్తర ఒరిస్సా తీరంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. రానున్న 48 గంటల్లో ఉత్తర ఒరిస్సా తీరంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.