ఫలక్‌‌నుమా–ఉందానగర్‌‌ లైన్ రెడీ

ఫలక్‌‌నుమా–ఉందానగర్‌‌ లైన్ రెడీ
  • ఎలక్ట్రిఫికేషన్‌‌, డబ్లింగ్‌‌ పనులు పూర్తి
  • ఎంఎంటీఎస్‌‌ ట్రైన్స్‌‌కు గ్రీన్‌‌సిగ్నల్‌‌ ఇస్తే ఉందానగర్‌‌ దాకా రైళ్లు

హైదరాబాద్‌‌, వెలుగు: సౌత్‌‌ సెంట్రల్‌‌ రైల్వే పరిధిలోని ఎంఎంటీఎస్‌‌ రెండో దశ ప్రాజెక్ట్‌‌ డెవలప్‌‌మెంట్‌‌లో మరో ముందడుగు పడింది. ఫలక్‌‌నుమా– ఉందానగర్‌‌ మధ్య ఎలక్ట్రిఫికేషన్‌‌తోపాటు డబ్లింగ్‌‌ లైన్‌‌ పనులు కంప్లీట్‌‌ అయ్యాయి. 13.98 కి.మీ. మేర కొత్త లైన్‌‌ నిర్మాణం అందుబాటులోకి వచ్చింది. మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు కూడా పూర్తయ్యాయి. ఎంఎంటీఎస్‌‌ రైళ్లకు గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇస్తే ఫలక్‌‌నుమా – ఉందానగర్‌‌ మధ్య రైళ్లు నడిచే చాన్స్‌‌ ఉంది. ప్రస్తుతం ఇతర ట్రైన్స్‌‌ నడవనున్నాయి.
84 కి.మీ.తో ఎంఎంటీఎస్‌‌ సెకండ్‌‌ ఫేజ్‌‌
హైదరాబాద్‌‌– సికింద్రాబాద్‌‌ జంట నగరాల్లో సబర్బన్‌‌ రవాణాలో మల్టీ మోడల్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ సర్వీస్‌‌ (ఎంఎంటీఎస్‌‌).. ప్రజలకు తక్కువ చార్జీలతో సేవలు అందిస్తోంది. ఫలక్‌‌నుమా– సికింద్రాబాద్‌‌– హైదరాబాద్‌‌– లింగంపల్లి– రాంచంద్రాపురం వరకు దీని నెట్‌‌వర్క్‌‌ ఉంది. ఎంఎంటీఎస్‌‌ తొలి దశ 42 కి.మీ వరకు విస్తరించి ఉంది. సబర్బన్‌‌ సర్వీసులను మరింత పొడిగించాలనే ఉద్దేశంతో ఎంఎంటీఎస్‌‌ రెండో దశలో 84 కి.మీ. విస్తరణకు ప్రతిపాదించారు. ఇందులో భాగంగా ఇప్పటికే తెల్లాపూర్‌‌–రాంచంద్రాపురం మధ్య కొత్త రైల్వే లైన్‌‌, సికింద్రాబాద్‌‌– బొల్లారం మధ్య ఎలక్ట్రిఫికేషన్‌‌, బొల్లారం–మేడ్చల్‌‌ ఎలక్ట్రిఫికేషన్‌‌ డబుల్‌‌ లైన్‌‌, ఘట్‌‌కేసర్‌‌– మౌలాలి మధ్య ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు ఫలక్‌‌నుమా– ఉందానగర్‌‌ ఎలక్ట్రిఫికేషన్‌‌, డబుల్‌‌ లైన్‌‌ పనులు కంప్లీట్‌‌ కావడంతో ఎంఎంటీఎస్‌‌ సెకండ్‌‌ ఫేజ్ ప్రాజెక్టు చివరి దశకు చేరుకుంది.
ఎన్నో ఉపయోగాలు
కర్నూలు, గుంతకల్‌‌, బెంగళూరు, సికింద్రాబాద్‌‌, కాచిగూడ స్టేషన్లకు అనుసంధానంలో ఫలక్‌‌నుమా– ఉందానగర్‌‌ రైల్వే లైన్‌‌ కీలకమైంది. ఏపీ, కర్నాటక సంపర్క్‌ క్రాంతి రైళ్లతో సహా అనేక ప్యాసింజర్‌‌ రైళ్ల సర్వీసులు ఈ రూట్‌‌లో వెళ్తాయి. ఎలక్ట్రిఫికేషన్‌‌, డబుల్‌‌ లైన్‌‌ నిర్మాణంతో ఈ సెక్షన్‌‌లో ట్రాఫిక్‌‌ కంట్రోల్‌‌కు తోడ్పడుతుంది. సబర్బన్‌‌, ప్యాసింజర్‌‌, ఎక్స్‌‌ప్రెస్‌‌ రైళ్ల ఆపరేషన్‌‌ ఎఫీషియన్సీ మెరుగవుతుంది. ఫలక్‌‌నుమా– ఉందానగర్‌‌ సెక్షన్‌‌లోని ఫలక్‌‌నుమా, ఎన్‌‌ఏపీ శివరాంపల్లి, బుద్వేల్‌‌, ఉందానగర్‌‌ స్టేషన్లలో కొత్త స్టేషన్‌‌ బిల్డింగ్స్‌‌, హైలెవల్‌‌ ప్లాట్‌‌ఫామ్స్, ఫుట్‌‌ ఓవర్‌‌ బ్రిడ్జిలు, వైడ్‌‌ సర్క్యులేటింగ్‌‌ ఏరియా, పార్కింగ్‌‌ ఫెసిలిటీస్‌‌తోపాటు ప్యాసింజర్లకు అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. సెక్షన్‌‌లో మొత్తం 24 బ్రిడ్జిలను నిర్మించారు.
ట్రాఫిక్‌‌ కంట్రోల్‌‌
ఫలక్‌‌నుమా– ఉందానగర్‌‌ మధ్య డబుల్‌‌ లైన్‌‌ పూర్తయ్యింది. దీన్ని అందుబాటులోకి తెచ్చిన స్టాఫ్‌‌, ఆఫీసర్లకు అభినందనలు. కొత్త లైన్‌‌ కంప్లీట్‌‌ కావడంతో ప్యాసింజర్, సరుకు రవాణా రైళ్ల నిర్వహణలో ట్రాఫిక్ కంట్రోల్‌‌ అవుతుంది. టైమ్​కు అనుగుణంగా, సజావుగా నడిపేందుకు వీలవుతుంది.
- గజానన్‌‌ మాల్యా, జీఎం, ఎస్​సీఆర్‌‌