
హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణం జరిగింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పబ్ లో ఇద్దరి యువకులపై బౌన్సర్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దిరికి ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
పబ్ లో సర్వర్ కెప్టెన్ గా పని చేస్తున్న కృతిక్(23), అదే పబ్ లో బౌన్సర్ గా పనిచేస్తున్న అమీర్ ల మధ్య గొడవ జరిగింది. దీంతో కృతీక్ తో పాటు ఉన్న అతని అన్న,స్నేహితులపై బౌన్సర్ అమీర్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఇందులో మల్లికార్జున్ పరిస్థితి విషమంగా ఉండగా కళ్యాణ్ కు చేతి, కాలికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి వచ్చిన రాయదుర్గం పోలీసులు గాయపడ్డ ఇద్దరినీ చికిత్స కోసం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. దాడికి పాల్పడ్డ అమీర్ ను అదుపులోకి తీసుకున్నారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.