చంద్రబాబు నిర్మించింది అమరావతి కాదు.. భ్రమరావతి: వైఎస్​ షర్మిల

చంద్రబాబు నిర్మించింది అమరావతి కాదు.. భ్రమరావతి: వైఎస్​ షర్మిల

ఏపీ న్యాయ యాత్రలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏలూరు జిల్లా పోలవరం నియోజక వర్గం కొయ్యలగూడెం  ​లో బహిరంగ సభ నిర్వహించారు. ఎన్నికల  ప్రచారంలో భాగంగా సీఎం జగన్​పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఏసీని సింగపూర్​గా మారుస్తానని 3D గ్రాఫిక్స్ చూపించాడని  కొయ్యలగూడెం సభలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అమరావతి అనే భ్రమరావతిని కట్టాడంటూ.. వ్యవసాయం దండగ అయిందంటూ.. కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేదన్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘన చంద్రబాబుకే దక్కుతుందన్నారు. బీజేపీకి ఒక్కసీటు లేకపోయినా.. ఏపీలో బీజేపీ రాజ్యమేలుతుందన్నారు.   - బాబు,జగన్,పవన్ ముగ్గురు బీజేపీ బానిసలుగా మారారన్నారు.  వీరిలో ఎవరికి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లేనన్నారు. 

. గత ఎన్నికల సమయంలో సీఎం జగన్​ ఎకరాకు 10లక్షల పరిహారం ఇస్తామని చెప్పారు.. - ఒక్క ఎకరానికైన ఇచ్చారా అని షర్మిల ప్రశ్నించారు.  ముంపు బాధితులకు కాలనీలు కట్టిస్తామని జగన్​ మోసం చేశారన్న .. ఆమె - పోలవరం ప్రాజెక్టుకు  కాంగ్రెస్ పార్టీ జాతీయ హోదా ఇచ్చిందన్నారు.  గత 10 ఏళ్లలో ప్రాజెక్ట్​ నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు.  బాబు... జగన్​ ఇద్దరూ కలిసి ఏపీ ప్రజలను మోసంచేశారంటూ .. .ప్రత్యేక హోదా రాకుండా చేశారన్నారు. అధికారంలో ఉండి స్పెషల్​ స్టేటస్​ కోసం ఒక్కనాడైనా ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు.

ఓటుకు ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి.. అది మీడబ్బే.. కాని ఓటేసేటప్పుడు ఆలోచించి వేయాలని ప్రజలను షర్మిల కోరారు.  కాంగ్రెస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమంటూ.. - 10 ఏళ్లు ప్రత్యేక హోదా కాంగ్రెస్ ఇస్తుందని తెలిపారు. - కాంగ్రెస్ అధికారంలో వస్తే  పోలవరం ప్రాజెక్టు కడతాం.. - ప్రాజెక్ట్ ముంపు బాధితులను న్యాయం చేస్తాం..- ఇళ్లు లేని పేద కుటుంబానికి 5 లక్షలతో  పక్కా ఇళ్లు కట్టించి ఇస్తాం..- ప్రతి పేద మహిళకు ఏడాదికి లక్ష ఆర్ధిక సహాయం...- 2 లక్షల రుణమాఫీ రైతులకు చేస్తాం  2.25లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కొయ్యలగూడెం సభలో వైఎస్​ షర్మిల అన్నారు.