సంగారెడ్డి కలెక్టరేట్‌‌‌‌లో మద్యం బాటిళ్లు

సంగారెడ్డి కలెక్టరేట్‌‌‌‌లో మద్యం బాటిళ్లు

సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ బిల్డింగ్‌‌‌‌లో మద్యం బాటిళ్లు ప్రత్యక్షమయ్యాయి. కలెక్టర్ చాంబర్‌‌‌‌‌‌‌‌కు పక్కనున్న ఆడిటోరియం సమీపంలో మందుబాబులు మద్యం తాగి ఖాళీ బాటిళ్లను అక్కడే పడేసి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం ఆఫీసు టైం వరకు ఆ మద్యం బాటిల్ అక్కడే పడి ఉండడం కలకలం రేపుతోంది. గతంలోనూ కలెక్టరేట్ ఆవరణలో బీరు బాటిళ్లు దర్శనమివ్వగా అప్పట్లో కలెక్టర్ ఉద్యోగులను, మెయింటెనెన్స్‌‌‌‌ కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌పై సీరియస్ అయ్యారు.  తాజాగా ఇప్పుడు మళ్లీ అలాంటి ఘటన జరిగింది. 

- సంగారెడ్డి, వెలుగు